ఫుడ్ డెలివరీ కి ప్రభుత్వం ఓకే.. నో అంటున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-03-25T04:42:43+05:30 IST

రెస్టారెంట్లపై దాడులు చేసి కిచెన్లు మూయించేస్తున్నారని ఫుడ్ స్టార్టప్ ఇన్నర్ చెఫ్ సంస్థ ఆరోపిస్తోంది.

ఫుడ్ డెలివరీ కి ప్రభుత్వం ఓకే.. నో అంటున్న పోలీసులు

న్యూఢిల్లీ: చాపకింద నీరులా దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొన్ని వ్యవస్థల విషయంలో నిబంధనలను కొంత సడలించారు. లాక్ డౌన్ వేళల్లో ప్రజలకు రెస్టారెంట్లు అందుబాటులో ఉండవని ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఫుడ్ డెలివరీలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా పేర్కొన్నాయి. కానీ పోలీసులు ఈ ఆదేశాలను పట్టించుకోవడంలేదని, తమ రెస్టారెంట్లపై దాడులు చేసి కిచెన్లు మూయించేస్తున్నారని ఫుడ్ స్టార్టప్ ఇన్నర్ చెఫ్ సంస్థ ఆరోపిస్తోంది. ఈ అనుభవాలు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా తదితర ప్రాంతాల్లో తమకు ఎదురయ్యాయని ఇన్నర్ చెఫ్ సీఈవో రాజేష్ సాహ్ని తెలిపారు. దీంతో భయపడిపోయిన వంటివాళ్ళు తమ తమ గ్రామాలకు పారిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇలాగే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా  రాష్ట్రంలో పలుచోట్ల మీడియా ప్రతినిధులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-03-25T04:42:43+05:30 IST