‘హలో! బాగున్నారా.. నేను మీ మోదీని’

ABN , First Publish Date - 2020-04-24T07:35:53+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రధాని మోదీ.. తన పాత సహచరుడితో మాట్లాడడం ద్వారా కాస్తంత

‘హలో! బాగున్నారా.. నేను మీ మోదీని’

పాత మిత్రుడికి ప్రధాని ఫోన్‌

3 నిమిషాల పాటు ఉల్లాసంగా కబుర్లు


 న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రధాని మోదీ.. తన పాత సహచరుడితో మాట్లాడడం ద్వారా కాస్తంత ఉపశమనం పొందారు. బీజేపీ సీనియర్‌ నేత, మోదీ ఒకప్పటి మిత్రుడు మోహన్‌లాల్‌ బౌతియాల్‌కు బుధవారం పీఎంవో నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రధాని ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా అవతలి వ్యక్తి చెప్పడంతో.. ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయన ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు.


ప్రధాని ఆయనతో దాదాపు 3నిమిషాల పాటు ఉల్లాసంగా మాట్లాడారు. యోగక్షేమాలను అడిగారు. బీజేపీలో కలిసి పనిచేసిన నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు తాను పాత మిత్రులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు మోదీ.. ఆయనకు తెలిపారు. ప్రధాని ఫోన్‌ చేసి మాట్లాడంతో బౌతియాల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 

Updated Date - 2020-04-24T07:35:53+05:30 IST