సీఎంలకు ప్రధాని బాస్‌ కాదు

ABN , First Publish Date - 2020-05-09T08:25:23+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహచరుడిగా కలిసి పనిచేయాలే తప్ప.. వారికి బాస్‌లా వ్యవహరించొద్దని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు.

సీఎంలకు  ప్రధాని బాస్‌ కాదు

  • వారితో సహచరుడిగా కలిసి పనిచేయాలి: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహచరుడిగా కలిసి పనిచేయాలే తప్ప.. వారికి బాస్‌లా వ్యవహరించొద్దని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రస్తుతం సాధారణ పరిష్కారాలు సాధ్యపడవని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) నుంచే అంతా నడపాలనుకుంటే ఫలితాలు సాధించలేమని, జిల్లా స్థా యి వరకూ అధికార వికేంద్రీకరణ జరిపి నిర్ణయాలు అమలయ్యేలా చూస్తేనే కరోనాపై విజయం సాధించగలమని అన్నారు. ఈ మేరకు రాహుల్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని సీఎంలను, సీఎంలు జిల్లా కలెక్టర్లను విశ్వసించాల్సిన అవసరం ఉం దన్నారు. ఇప్పటికైనా లాక్‌డౌన్‌ నుంచి బయటపడే ప్ర ణాళిక విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.


45 రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్నా సమ స్య తీవ్రత తగ్గలేదని, తమ కార్యాచరణ ప్రణాళిక ఏమి టో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టే ఆలోచన తనకు లేదని రాహుల్‌గాంధీ అన్నారు. రఘురామరాజన్‌, అభిషేక్‌ బెనర్జీ వం టి ఆర్థిక నిపుణులతో దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించానని రాహుల్‌ వెల్లడించారు. కాగా, వలస కార్మికుల తరలింపు విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. 

Updated Date - 2020-05-09T08:25:23+05:30 IST