వేరే దేశ ప్రధానికి మన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదు: రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2020-12-30T17:32:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏ విధంగా ఉద్యమం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం

వేరే దేశ ప్రధానికి మన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదు: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏ విధంగా ఉద్యమం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రైతులకు మద్దతిచ్చిన వారిలో భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలే కాకుండా, విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒకరు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా తన మద్దతు రైతులకు ఉంటుందని ఆయన చెప్పారు. జస్టిన్ ట్రూడో రైతులకు మద్దతు ఇవ్వడంపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. అయినప్పటికి జస్టిన్ ట్రూడో మాత్రం వెనక్కు తగ్గలేదు. శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు ఎవరికైనా ఉందని, ప్రపంచంలో ఈ విధంగా ఎవరు చేసినా తాను మద్దతిస్తానంటూ వివరణ ఇచ్చారు. 


ఇక జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా స్పందించారు. ‘ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే.. వేరే దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడటం మానుకోవాలి. భారత్‌కు బయటివారి జోక్యం అవసరం లేదు. ఇది మన అంతర్గత వ్యవహారం. మన అంతర్గత వ్యవహారాలపై జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి కూడా లేదు’ అని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-30T17:32:03+05:30 IST