నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-08-11T14:02:33+05:30 IST
తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ, అస్సోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉండటం, కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.