ఈ నెల 27న అత్యాధునిక ల్యాబ్‌లు ప్రారంభించనున్న ప్రధాని
ABN , First Publish Date - 2020-07-25T04:36:08+05:30 IST
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మూడు కొత్త ల్యాబ్‌లు ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మూడు అత్యాధునిక ల్యాబ్‌లు(ఐసీఎంఆర్) ప్రారంభించనున్నారు. ముంబై, నోయిడా, కోల్‌కతాలో ఏర్పాటు చేసే ఈ మూడు ల్యాబ్‌లను ప్రధాని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.
కరోనా మహమ్మరి భారత్‌లో వెలుగు చూసినప్పుడు దేశంలో ఒకే ఒక్క ల్యాబ్ ఉండేది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నేడు 12వందలకు పైగా ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ఇందులో 900 ప్రభుత్వానివి కాగా 300 ప్రైవేట్‌వి. ఇప్పటివరకూ కోటిన్నర టెస్టులు చేసిన భారత్ రోజుకు పది లక్షల శాంపిళ్లను పరీక్షించేంత స్థాయికి రావాలని యోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు మూడున్నర లక్షల టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.