13న తమిళనాడుకు ప్రధాని మోదీ..?

ABN , First Publish Date - 2020-12-06T16:29:31+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న

13న తమిళనాడుకు ప్రధాని మోదీ..?

చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గత నెల చెన్నైకి వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కూటమి కొనసాగుతుందని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం పార్టీ నిర్వాహకులతో అమిత్‌షా చర్చించారు. ఆయన వచ్చి వెళ్లిన అనంతరం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారని సమాచారం అందుతుంది.


ఆ రోజు ఉదయం విమానం ద్వారా చెన్నైకు చేరుకోనున్న ప్రధాని, అక్కడి నుంచి విమానం ద్వారా కోయంబత్తూర్‌ వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నటుడు రజనీకాంత్‌ భేటీ అవుతారని సమాచారం. అనంతరం ప్రధాని ఢిల్లీ వెళ్లారు. ఈ విషయమై రాష్ట్ర ఉన్నతాధికారులు మాట్లాడుతూ, పీఎం కార్యాలయం నుంచి ఇంకా పర్యటన వివరాలు అందలేదని తెలిపారు.

Read more