ఆకలికి తాళలేక మొక్కలు తింటున్న పిల్లలు

ABN , First Publish Date - 2020-03-28T08:51:07+05:30 IST

వారు ఆరుగురు పిల్లలు.. అంతా పదేళ్లలోపే ఉంటారేమో! ఓ చోట కూర్చుని మొక్కలను తింటున్నారు. ఆకలి బాధకు తాళలేక పిల్లల ఈ దయనీయ స్థితిని చూసి ఎవరు వీడియో...

ఆకలికి తాళలేక మొక్కలు తింటున్న పిల్లలు

ప్రధాని మోదీ నియోజకవర్గంలో దళిత చిన్నారుల దయనీయ స్థితి

వారాణసీ, మార్చి 27: వారు ఆరుగురు పిల్లలు.. అంతా పదేళ్లలోపే ఉంటారేమో! ఓ చోట కూర్చుని మొక్కలను తింటున్నారు. ఆకలి బాధకు తాళలేక పిల్లల ఈ దయనీయ స్థితిని చూసి ఎవరు వీడియో తీశారో ఏమో గానీ సా మాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. చిన్నారులంతా కూడా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ వారణాసి నియోజకవర్గం కొయిరీపూర్‌ గ్రామానికి చెందిన ముసహర్‌ అనే వర్గానికి చెం దిన దళితులు. వీరి తల్లిదండ్రుల్లో కొందరు దినసరి కూలీలు, మరికొందరు యాచకులు. లాక్‌డౌన్‌ ప్రభావంతో పనులు లేకపోవడం, భిక్షం దొరక్క పోవడంతో ఈ కుటుంబాలకు కష్టాలు మరింత పెరిగాయి. పిల్లలు మొక్కలను తింటున్న విషయం తెలియగానే అధికారులు ఉరుకుల పరుగుల మీద ఆ గ్రామానికి వెళ్లి చిన్నారుల కుటుంబాలకు సాయం చేశారు. వారికి నిత్యావసర సరుకులు చేరే ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-03-28T08:51:07+05:30 IST