మన ఉపాధ్యాయులే మన హీరోలు : ప్రధాని మోదీ ట్వీట్

ABN , First Publish Date - 2020-09-05T15:18:06+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ

మన ఉపాధ్యాయులే మన హీరోలు : ప్రధాని మోదీ ట్వీట్

న్యూఢిల్లీ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. జాతికి వారు చేస్తున్న గొప్ప సేవలను ప్రశంసించారు. ‘‘జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. విద్యార్థుల మనసులను తిప్పడంలోనూ వారి పాత్ర కీలకమే. వారందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తున్నా. గురుపూజా దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ  కృతజ్ఞతలు. సర్వేపల్లి రాధాకృష్ణణ్‌కు నివాళులు అర్పిస్తున్నా. మన ఉపాధ్యాయులే మన హీరోలు’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-05T15:18:06+05:30 IST