మోదీ అధ్యక్షత కేబినెట్ కీలక భేటీ

ABN , First Publish Date - 2020-05-13T21:11:28+05:30 IST

నాలుగో దశ లాక్‌డౌన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం 4:30 నిమిషాలకు కేంద్ర

మోదీ అధ్యక్షత కేబినెట్ కీలక భేటీ

న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్‌డౌన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం 4:30 నిమిషాలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కేబినెట్ మంత్రులందరూ హాజరు కానున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి అందిన సలహాలు, సూచనల మేరకు నాలుగో దశ లాక్‌డౌన్ నిబంధనలు పూర్తి భిన్నంగా రూపొందిస్తామని నరేంద్ర మోదీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.


ఆ వివరాలను 18 తేదీ కంటే ముందే తెలియజేస్తామని కూడా ప్రధాని పేర్కొన్నారు. నాలుగో దశ లాక్‌డౌన్‌లో ఏయే రంగాలకు సడలింపులివ్వాలి, ఆర్థిక కార్యకలాపాలను దేశమంతటా ఎలా పరుగులు పెట్టించాలన్న దానిపై మోదీ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. 


Read more