మా అమ్మ నాకు ఫోన్ చేసి ఒకే విషయాన్ని అడుగుతుంది: మోదీ

ABN , First Publish Date - 2020-09-24T19:11:15+05:30 IST

‘ఫిట్‌నెస్’ కు ఐకాన్స్ గా భావించే కొందరు ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మా అమ్మ నాకు ఫోన్ చేసి ఒకే విషయాన్ని అడుగుతుంది: మోదీ

న్యూఢిల్లీ : ‘ఫిట్‌నెస్’ కు ఐకాన్స్ గా భావించే కొందరు ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా  మిలింద్ సోమన్, విరాట్ కోహ్లీతో పాటు మరి కొందరితో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా ప్రముఖ న్యూట్రిషియన్ రాజూతా దివాకర్‌తో ప్రధాని మాట్లాడుతూ... ఆసక్తికర విషయాన్ని, తన డైట్ రహస్యాన్ని వెల్లడించారు. ‘‘వారానికి రెండు రోజులు మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది. నా యోగ క్షేమాలు అడుగుతుంది. ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా  ప్రతిరోజు ‘పసుపు వాడుతున్నావా’’? అని అడుగుతుంది. నేను కూడా సోషల్ మీడియాలో పసుపు వాడకంపై చాలా సార్లు మాట్లాడా.’’ అని ప్రధాని మోదీ రాజుతా దివాకర్ తో అన్నారు. 

Updated Date - 2020-09-24T19:11:15+05:30 IST