రిపబ్లిక్ వేడుకలకు విచ్చేస్తున్న బ్రిటన్ ప్రధాని
ABN , First Publish Date - 2020-12-15T20:40:26+05:30 IST
భారత గణతంత్రదినోత్సవ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నారు. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రకటించారు.

ఢిల్లీ: భారత గణతంత్రదినోత్సవ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నారు. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు జాన్సన్ హాజరు కాబోతున్నారని మంగళవారం మీడియాకు తెలిపారు. అలాగే యూకే నేతృత్వంలో.. వచ్చే ఏడాది జరగనున్న జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీని తమ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారని ఆయన తెలిపారు.
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. బ్రిటన్‌తో ముఖ్యంగా ఐదు అంశాలపై చర్చించామని జైశంకర్ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యం, వాతావరణం, భద్రత, రక్షణ, వ్యాపారం, ప్రజాసంబంధాలు తదితర అంశాలను చర్చించామన్నారు.