జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగంలోని అంశాలివే

ABN , First Publish Date - 2020-03-20T01:47:07+05:30 IST

మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇన్ని దేశాలు ప్రభావితం కాలేదని, కానీ నేడు కరోనా వైరస్‌తో మాత్రం ప్రపంచ దేశాలన్నింటినీ సంకట స్థితిలోకి

జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగంలోని అంశాలివే

న్యూఢిల్లీ : మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇన్ని దేశాలు ప్రభావితం కాలేదని, కానీ నేడు కరోనా వైరస్‌తో మాత్రం ప్రపంచ దేశాలన్నింటినీ సంకట స్థితిలోకి నెట్టేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రకృతి విపత్తులు ఏర్పడిన సందర్భంలో కొన్ని ప్రాంతాలే ప్రభావితం చెందుతాయి కానీ, కరోనాతో మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ప్రభావానికి లోనయ్యాయని అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ జడలు విప్పడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాను ఇకపై తేలిగ్గా తీసుకోలేదని, బాధితులను ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కరోనాతో పోరాడటానికి సరైన సంకల్పంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని  మోదీ పిలుపునిచ్చారు. స్వయంగా ఆరోగ్యంగా ఉండటం అంటే జగత్తును ఆరోగ్యంగా ఉంచడమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-20T01:47:07+05:30 IST