అవురియా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియాకు ప్రధాని ఆమోదం

ABN , First Publish Date - 2020-05-17T14:44:05+05:30 IST

అవురియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

అవురియా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియాకు ప్రధాని ఆమోదం

న్యూఢిల్లీ : అవురియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించడానికి ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేశారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా చికిత్స పొందుతున్న వారి కోసం యాబై వేల రూపాయలను కూడా ప్రకటించింది.


‘‘అవురియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించాం. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి యూపీ ప్రభుత్వానికి ఆమోదం లభించింది’’ అని పీఎంవో ట్వీట్ చేసింది. యూపీలోని అవురియాలో శనివారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది వలస కార్మికులు చనిపోగా, 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా లాక్‌‌డౌన్ నేపథ్యంలో రాజస్థాన్, ఢిల్లీ నుంచి స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులే.


Updated Date - 2020-05-17T14:44:05+05:30 IST