ప్రధాని మోదీకి కూడా తోబుట్టువులున్నారు : తేజస్వీ యాదవ్

ABN , First Publish Date - 2020-10-27T19:00:30+05:30 IST

లాలూ కుటుంబంపై సీఎం నితీశ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ యువనేత తేజస్వీ సూర్య ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు ప్రధాని మోదీపై

ప్రధాని మోదీకి కూడా తోబుట్టువులున్నారు : తేజస్వీ యాదవ్

పాట్నా : లాలూ కుటుంబంపై సీఎం నితీశ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ యువనేత తేజస్వీ సూర్య ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు ప్రధాని మోదీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘సీఎం నితీశ్ మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఆయన మోదీని కూడా టార్గెట్ చేశారు. ప్రధాని మోదీకి కూడా తోబుట్టువులున్నారు. నితీశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మహిళలను కించపరుస్తున్నారు. మా అమ్మ సెంటిమెంట్‌పై దెబ్బ కొట్టారు. అవినీతి, నిరుద్యోగిత లాంటి ముఖ్యమైన అంశాలపై సీఎం నితీశ్ మాట్లాడరు.’’ అంటూ తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.


సీఎం నితీశ్ ఏమన్నారంటే..

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన ఓ ర్యాలీలో సీఎం నితీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లాలూ కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లాలూకు తొమ్మిది మంది సంతానం ఉన్నారని, తేజస్వీ, సూర్య ప్రతాప్ తో పాటు మరో ఏడుగురు కూతుళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అయితే... కూతుళ్లను రాజకీయాల్లో ప్రోత్సహించకుండా కేవలం కుమారులను మాత్రమే లాలూ ప్రోత్సహించారంటూ నితీశ్ వ్యాఖ్యానించారు. లాలూకు కూతుళ్లపై ఏమాత్రం నమ్మకం లేదని ధ్వజమెత్తారు. ఏడుగురు కూతుళ్ల తర్వాత ఇద్దరు కుమారులు జన్మించారని, ఎలాంటి బిహార్ కావాలో మీరే తేల్చుకోవాలని నితీశ్ వ్యాఖ్యానించారు. 

 

Updated Date - 2020-10-27T19:00:30+05:30 IST