42 కోట్ల మందికి 65,454 కోట్లు

ABN , First Publish Date - 2020-06-21T07:16:07+05:30 IST

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద దేశంలోని 42 కోట్లకు పైగా పేద ప్రజలకు రూ.65,454 కోట్ల ఆర్థిక సాయం పొందినట్టు ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది...

42 కోట్ల మందికి 65,454 కోట్లు

  • పీఎంజీకేపీ కింద పొందిన ఆర్థిక సాయం


న్యూఢిల్లీ, జూన్‌ 20: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద దేశంలోని 42 కోట్లకు పైగా పేద ప్రజలకు రూ.65,454 కోట్ల ఆర్థిక సాయం పొందినట్టు ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా పేదలు తమ ఆదాయాన్ని కోల్పోయారని, ప్రభుత్వ సాయం ద్వారా వీరికి కాస్త ఊరట లభించినట్టు పేర్కొంది. కరోనా మూలంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేసింది.


మహిళలు, పేద సీనియర్‌ సిటిజన్లు, రైతులకు నగదు అందించింది. తాజాగా జూన్‌ 19 వరకు అందుబాటులో ఉన్న వివరాలను ఆర్థిక శాఖ వెల్లడించింది. పీఎం కిసాన్‌ తొలి విడత కింద 8.94 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.17,891 కోట్లు అందించినట్టు పేర్కొంది. మూడు వాయిదాల్లో మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.30,952 కోట్లు జమ చేసినట్టు తెలిపింది. రెండు వాయిదాల్లో దాదాపు 2.81 కోట్ల మంది వయసుపైబడిన వారు, వితంతువులు, వికలాంగులకు రూ.2,814.5 కోట్లు పంపిణీ చేసినట్టు పేర్కొంది. 2.3 కోట్ల మంది భవన, నిర్మాణ కార్మికులు రూ.4,312.82 కోట్ల ఆర్థిక సాయాన్ని అందుకున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఏప్రిల్‌ నెలకు 36 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 113 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నట్టు పేర్కొంది. మే నెలకు 36.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను 72.83 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జూన్‌ నెలకు 29 రాష్ర్టాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27.18 కోట్ల లబ్ధిదారులకు 13.59 లక్షల కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అందించారు. 


Updated Date - 2020-06-21T07:16:07+05:30 IST