పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ సంస్థ కాదు
ABN , First Publish Date - 2020-06-01T06:21:28+05:30 IST
పీఎం కేర్స్ ఫండ్‌కు ఇప్పటిదాకా ఎంత మేర విరాళాలు వచ్చాయో తెలుసుకునేందుకు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఎల్‌ఎల్‌ఎం విద్యార్థి హర్ష కందుకూరి సమాచార హక్కు చట్టం...
- ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి రాదు: పీఎంవో
న్యూఢిల్లీ, మే 31: పీఎం కేర్స్ ఫండ్‌కు ఇప్పటిదాకా ఎంత మేర విరాళాలు వచ్చాయో తెలుసుకునేందుకు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఎల్‌ఎల్‌ఎం విద్యార్థి హర్ష కందుకూరి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వివరాలను కోరారు. ఏప్రిల్ 1న హర్ష ఈ దరఖాస్తు చేశారు. మే 30 పీఎం కేర్స్ ఫండ్ నుంచి సమాధానం వచ్చింది. పీఎం కేర్స్ ఫండ్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిరాకరించింది. ఈ నిధి ప్రభుత్వం సంస్థ కాదని, ఆర్‌టీఐ చట్టం నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.