‘పీఎం కేర్స్ ఫండ్’ ఆడిట్ లెక్కలోకి రాదా?

ABN , First Publish Date - 2020-04-25T00:25:31+05:30 IST

కోవిడ్ - 19 మహమ్మారిని ఎదుర్కోడానికి ఏర్పడ్డ ‘పీఎం కేర్స్ ఫండ్’ ను కంప్ర్టోటర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చే ఎలాంటి ఆడిటూ చేయమని సంబంధిత

‘పీఎం కేర్స్ ఫండ్’ ఆడిట్ లెక్కలోకి రాదా?

న్యూఢిల్లీ : కోవిడ్ - 19 మహమ్మారిని ఎదుర్కోడానికి ఏర్పడ్డ ‘పీఎం కేర్స్ ఫండ్’ ను కంప్ర్టోటర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చే ఎలాంటి ఆడిటూ చేయమని సంబంధిత అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ‘‘వివిధ వ్యక్తుల నుంచి, వివిధ సంస్థల నుంచి వచ్చిన విరాళం కాబట్టి స్వచ్ఛంద సంస్థను ఆడిట్ చేయడానికి మాకు ఎలాంటి హక్కూ లేదు’’ అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.


సంబంధిత ట్రస్టు వ్యక్తులు ఆడిట్ చేయమని అడిగితేనే తాము ఆడిట్ చేస్తామని, లేదంటే వారి అకౌంట్స్‌ను ఆడిట్ చేసే ప్రసక్తే లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. అయితే సంబంధిత ట్రస్టీలు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర ఆడిటర్లు మాత్రమే పీఎం కేర్ ఫండ్‌ను ఆడిట్ చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 


దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనా పోరుకు, వివిధ సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వాలనుకునేవారు దీని వేదికగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న మొత్తంలో కూడా విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. ఇకపై, ఏర్పడే విపత్తులు, అత్యవసర సమయాల్లో కూడా ఈ ఫండ్ సహాయ పడుతుందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులు కూడా తమ వంతు విరాళాలను ప్రకటించారు. 

Updated Date - 2020-04-25T00:25:31+05:30 IST