కరోనా సోకే ప్రమాదం ఉందా?.. మొబైల్‌తో పట్టేయండి: ప్రధాని ఆదేశం

ABN , First Publish Date - 2020-03-24T03:26:46+05:30 IST

కరోనా సోకే ప్రమాదం ఉన్న వారిని గుర్తించడానికి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలట.

కరోనా సోకే ప్రమాదం ఉందా?.. మొబైల్‌తో పట్టేయండి: ప్రధాని ఆదేశం

మాస్కో: కరోనా సోకే ప్రమాదం ఉన్న వారిని గుర్తించడానికి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలట. దేశంలో కరోనా వైరస్ సోకిన వారిని, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని మొబైల్‌లోని జియో లొకేషన్ డేటాతో గుర్తించే విధంగా ఓ విధానాన్ని రూపొందించాలని రష్యా ప్రధానమంత్రి మిఖైల్ మిషుస్టిన్ అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని మొబైల్‌లోని జియో లొకేషన్ డేటాతో గుర్తించడం, వారిని క్వారంటైన్‌లో ఉంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానాన్ని సిద్ధం చేయడానికి అధికారులకు ఐదు రోజుల గడువిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, రష్యాలో ఇప్పటికి 438 కరోనా కేసులు నమోదవగా, కేవలం ఒక్కరే మృతిచెందారు.

Updated Date - 2020-03-24T03:26:46+05:30 IST