జనతా కర్ఫ్యూ భేష్
ABN , First Publish Date - 2020-03-24T09:11:32+05:30 IST
కరోనాపై పోరులో భాగంగా నిర్వహించిన జనతా కర్ఫ్యూను ప్రజలంతా విజయవంతం చేశారని....

లాక్‌డౌన్‌కూ సహకరించండి: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో భాగంగా నిర్వహించిన జనతా కర్ఫ్యూను ప్రజలంతా విజయవంతం చేశారని, అదే స్ఫూర్తితో లాక్‌డౌన్‌కూ సహకరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లోనూ జాతి యావత్తూ ఒకతాటిపై నడిచిదంటూ అభినందించా రు. వెంకయ్య ప్రకటనకు రాజ్యసభ సభ్యులంతా బల్లలు చరిచి స్వాగతించారు. ఇదే ప్రేరణతో కరోనాను త్వరలోనే అధిగమిద్దామని పేర్కొంది.