‘ఆన్‌లైన్లో మద్యం’ అనుమతించండి

ABN , First Publish Date - 2020-03-21T07:27:59+05:30 IST

‘ఆన్‌లైన్లో మద్యం’ అనుమతించండి

‘ఆన్‌లైన్లో మద్యం’ అనుమతించండి

 తిరువనంతపురం (కేరళ), మార్చి 20: ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్టు.. కరోనా నేపథ్యంలో ఒక్కొక్కరివి ఒక్కో రకమైన కష్టాలు. కేరళలోని ఓ మందుబాబు.. మద్యం షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోందని, కరోనా భయంతో తనలాంటి వాళ్లు షాపులకు వెళ్లలేకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టుమెట్లెక్కాడు. మద్యాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఇళ్లకే సరఫరా చేసేలా బేవరేజ్‌సకు ఆదేశాలివ్వాలని కోరుతూ అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. పిటిషనర్‌కి 50 వేల రూపాయలు జరిమానా విధించారు. ‘‘ఇందులో పిటిషనర్‌, అతడి లాంటి వాళ్ల స్వార్థం తప్ప, ఎలాంటి ప్రయోజనాలూ లేవు’’ అని వ్యాఖ్యానించిన జడ్జి.. పిటిషన్‌ను తోసిపుచ్చారు.

Updated Date - 2020-03-21T07:27:59+05:30 IST