ఇండోర్, లఖ్‌నవూల్లో ప్లాస్మా థెరపీ
ABN , First Publish Date - 2020-04-28T06:19:14+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో ఒకటైన ఇండోర్‌లో సోమవారం ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎ్‌సఏఐఎమ్‌ఎ్‌స)లో ముగ్గురికి...

- ప్రయోగాత్మకంగా నిర్వహించిన వైద్యులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశవ్యాప్తంగా కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో ఒకటైన ఇండోర్‌లో సోమవారం ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎ్‌సఏఐఎమ్‌ఎ్‌స)లో ముగ్గురికి ప్లాస్మా థెరపీని నిర్వహించారు. అదే ఆస్పత్రిలో పనిచేస్తూ కొవిడ్ బారిన పడి కోలుకున్న ఇద్దరు వైద్యులు ఇజార్ మున్షీ, ఇక్బాల్ ఖురేషీ ప్లాస్మాను దానం చేశారు. ఇండోర్ జిల్లాలో ఇప్పటి వరకు 1,207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 60 మంది చనిపోయారు. యూపీ రాజధాని లఖ్‌నవూలో కూడా సోమవారం ప్లాస్మా థెరపీని నిర్వహించారు. కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ(కేజీఎమ్‌యూ)లో పనిచేసే 58 ఏళ్ల వైద్యుడికి థెరపీలో భాగంగా మొదటి డోసు ఇచ్చారు. అవసరమైతే మరో డోసు ఇస్తామని వైద్యులు తెలిపారు. అదే ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొంది కోలుకున్న కెనడా వైద్యురాలు ప్లాస్మాను దానం చేశారు. ప్లాస్మా థెరపీని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ థెరఫీ వల్ల ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బ్రిటన్, అమెరికా దేశాల్లో కూడా ప్లాస్మా థెరపీని నిర్వహిస్తున్నారు.