ఆశాదీపంలా ప్లాస్మా థెరపీ

ABN , First Publish Date - 2020-04-14T07:47:52+05:30 IST

కరోనా కట్టడికి ఓ ఔషధమంటూ లేని ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్లాస్మా థెరపీ ఆశాదీపంలా కనిపిస్తోంది. తాజాగా అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న సెయింట్‌ ల్యూక్స్‌ మెడికల్‌ సెంటర్‌లో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌తో...

ఆశాదీపంలా ప్లాస్మా థెరపీ

  • హ్యూస్టన్‌లో కోలుకుంటున్న ముగ్గురు భారత అమెరికన్లు

హ్యూస్టన్‌ (అమెరికా), ఏప్రిల్‌ 13 : కరోనా కట్టడికి ఓ ఔషధమంటూ లేని ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్లాస్మా థెరపీ ఆశాదీపంలా కనిపిస్తోంది. తాజాగా అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న సెయింట్‌ ల్యూక్స్‌ మెడికల్‌ సెంటర్‌లో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌తో చేరిన ముగ్గురు భారత అమెరికన్లకు ప్లాస్మా థెరపీ చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం వారు(రోహన్‌ బవదేకర్‌, లవంగ వేలుస్వామి, సుష్మ్‌ సింగ్‌) ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకుంటున్నారని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ డీన్‌(అకాడమిక్‌ అఫైర్స్‌) అశోక్‌ బాలసుబ్రమణ్యం వెల్లడించారు. మరో ఇద్దరు అమెరికన్లకూ ఈ చికిత్స అందించామని ఆయన తెలిపారు.  


Updated Date - 2020-04-14T07:47:52+05:30 IST