దాతల్లేక ముందుకు సాగని ప్లాస్మా థెరఫీ

ABN , First Publish Date - 2020-04-24T07:06:52+05:30 IST

కొవిడ్‌ చికిత్స కోసం భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్లాస్మా థెరఫీకి అనుతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ముంబైలో దీనిని నిర్వహించాలని సూచించింది.

దాతల్లేక ముందుకు సాగని ప్లాస్మా థెరఫీ

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు రక్తం ఇవ్వట్లేదు

ఇచ్చిన వారి ప్లాస్మాలో యాంటీబాడీస్‌ తక్కువ


ముంబై, ఏప్రిల్‌ 23: కొవిడ్‌ చికిత్స కోసం భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్లాస్మా థెరఫీకి అనుతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ముంబైలో దీనిని నిర్వహించాలని సూచించింది. అయితే క్షేత్ర స్థాయిలో ప్లాస్మా దాతలు దొరక్కపోవడం వల్ల ఈ చికిత్సా విధానం ముందుకు సాగడం లేదు. ప్లాస్మా థెరఫీలో భాగంగా.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దీనిని మరో రోగికి ఎక్కిస్తారు. దీనిలో యాంటీబాడీస్‌ రోగి తొందరగా కోలుకోవడానికి తోడ్పడతాయి. కానీ కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.


ముంబైలో 500 మందికి పైగా కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా పది మంది కూడా ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రాలేదని వైద్యులు చెబుతున్నారు. వచ్చిన వారిలో కొందరి ప్లాస్మాలో తగినన్ని యాంటీబాడీస్‌ లేవని, దానిని చికిత్సకు వాడలేమన్నారు. దీంతో ఐసీఎంఆర్‌ అనుమతిచ్చినా ప్లాస్మా థెరఫీ ముందుకు సాగడం లేదని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2020-04-24T07:06:52+05:30 IST