లక్ష ర్యాపిడ్ టెస్టుల కోసం ఆర్డర్ పెట్టాం: ఢిల్లీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-04-07T20:02:32+05:30 IST

కరోనా కట్టడికి వీలైనంత ఎక్కువగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి బారిన పడ్డ వారిని క్వారంటైన్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలుమార్లు సూచించింది. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ యాండీ బాడీ టెస్టుల ప్రాముఖ్యత పెరిగింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ దిశగా కీలక అడుగు వేసింది.

లక్ష ర్యాపిడ్ టెస్టుల కోసం ఆర్డర్ పెట్టాం: ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి వీలైనంత ఎక్కువగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి బారిన పడ్డ వారిని క్వారంటైన్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలుమార్లు సూచించింది. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ యాండీ బాడీ టెస్టుల ప్రాముఖ్యత పెరిగింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ దిశగా కీలక అడుగు వేసింది. లక్ష మందికి సరిపడా ర్యాపిడ్ టెస్టుల కిట్లకు ఆర్డర్ పెట్టామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే 50 వేల కిట్లకు ఆర్డర్ ఇచ్చామని, వాటి డెలివరీ ప్రారంభమైందని అన్నారు. తాజాగా ఆర్డరిచ్చిన లక్ష కిట్ల డెలివరీ శుక్రవారం నుంచి మొదలవుతుందన్నారు. వీటి సాయంతో కరోనా హాట్ స్పాట్లలో ముమ్మర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 

Read more