రైల్వేలో ఈ వింత గురించి తెలుసా.. పియూష్ గోయల్ ఆసక్తికర ట్వీట్!

ABN , First Publish Date - 2020-07-06T16:35:58+05:30 IST

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలో వింతలు, విశేషాలకు కొదవలేదు....

రైల్వేలో ఈ వింత గురించి తెలుసా.. పియూష్ గోయల్ ఆసక్తికర ట్వీట్!

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలో వింతలు, విశేషాలకు కొదవలేదు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని నందూర్బార్ జిల్లా నవాపూర్ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి విశేషమే ఒకటి ఉంది. దీన్ని గుజరాత్, మహారాష్ట్ర చెరోసగం పంచుకుంటున్నాయి. దీని తాలూకు ఫోటోను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఇటీవల ట్విటర్లో షేర్ చేసుకున్నారు. దీంతో తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘దేశంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ఓ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? సూరత్‌-భుసావల్ మార్గంలో నవాపూర్ రైల్వే స్టేషన్ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఈ స్టేషన్ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది...’’ అని పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఇలాంటి స్టేషన్ ఇదొక్కటే కాదు.. ‘‘భవానీ మండి’’ రైల్వే స్టేషన్ కూడా మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉంది.



Updated Date - 2020-07-06T16:35:58+05:30 IST