పింజ్రా తోడ్ ఉద్యమకారికి బెయల్ మంజూరు

ABN , First Publish Date - 2020-09-01T21:59:07+05:30 IST

ఢిల్లీలో జరిగిన హింసలో ఆమె పాల్గొనలేదని, ఆమె ప్రసంగ కాపీ కూడా లేదని కోర్టు ముందు సిబాల్ వాదనలు వినిపించారు. దేవాంగన అరెస్టుకు ప్రాతిపదికగా తీసుకున్న షారూక్ వాంగ్మూలంలోనూ ఆమె పేరును ప్రస్తావించలేదని ఆయన

పింజ్రా తోడ్ ఉద్యమకారికి బెయల్ మంజూరు

న్యూఢిల్లీ: పింజ్రా తోడ్ సంస్థ సభ్యురాలు దేవాంగన కలిటాకు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు అనుకూలురు, ప్రతికూలుర మధ్య జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన ఆమె ఇంత కాలం జైలులో ఉన్నారు. ఆమె తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.


ఢిల్లీలో జరిగిన హింసలో ఆమె పాల్గొనలేదని, ఆమె ప్రసంగ కాపీ కూడా లేదని కోర్టు ముందు సిబాల్ వాదనలు వినిపించారు. దేవాంగన అరెస్టుకు ప్రాతిపదికగా తీసుకున్న షారూక్ వాంగ్మూలంలోనూ ఆమె పేరును ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, హింసలో పాల్గొన్న అందరి వీడియో ఫుటేజ్ సంపాదించడం సాధ్యం కాదని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ సురేశ్ కుమార్ ఏకసభ్య ధర్మాసనం ఆమెకు బెయిలు మంజూరు చేసింది.

Updated Date - 2020-09-01T21:59:07+05:30 IST