మా అమ్మ నూరిపోసిన ధైర్యమే నాకు రాజకీయ పునాదులయ్యాయి : పినరయ్ విజయన్

ABN , First Publish Date - 2020-05-10T19:23:41+05:30 IST

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన మాతృమూర్తిని గుర్తు చేసుకున్నారు. తన తల్లి

మా అమ్మ నూరిపోసిన ధైర్యమే నాకు రాజకీయ పునాదులయ్యాయి : పినరయ్ విజయన్

కేరళ : అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన మాతృమూర్తిని గుర్తు చేసుకున్నారు. తన తల్లి జీవితంలో ఎదుర్కొన్న ధైర్యం మరియు సంకల్పాలే తనకు పాఠాలు నేర్పించి, రాజకీయ పునాదులు వేశాయని పేర్కొన్నారు.


‘‘అందరి లాగే నా జీవితంలోనూ అమ్మ ప్రభావం ఉంది. మా నాన్న అనారోగ్యం కారణంగా తొందరగానే తనువు చాలించారు. దీంతో కుటుంబ బాధ్యతలు మా అమ్మ భుజాలపై పడ్డాయి. వాటిని అత్యంత ధైర్యంతో ఎదుర్కొంది. మొత్తం పద్నాలుగు మంది పిల్లల్లో... పదకొండు మందిని ఆ మాతృమూర్తి కోల్పోయింది. ఆమె చిన్న కుమారుడిగా నేను పెరిగాను. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడంలో ప్రదర్శించాల్సిన నైపుణ్యాలను మా అమ్మే నాకు నేర్పింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా మా అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నా. మాతృమూర్తులందరికీ కృతజ్ఞలు.’’ అంటూ ఫేస్‌బుక్ లో సీఎం పినరయ్ పోస్ట్ చేశారు. 

Updated Date - 2020-05-10T19:23:41+05:30 IST