కరోనా మీ వల్లేనంటూ.. చైనా అధ్యక్షుడిపై కేసు
ABN , First Publish Date - 2020-03-17T02:29:14+05:30 IST
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని చైనా కావాలనే తయారు చేసిందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
పట్నా: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని చైనా కావాలనే తయారు చేసిందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనాను పోలి ఉన్న ఓ వైరస్‌ను చైనా ల్యాబుల్లో తయారు చేశారంటూ ఓ పుస్తకంలో రాసిన విషయం వైరలయింది. ఈ వార్తలతో చైనాపై పలువురు అనుమానాలు లేవనెత్తారు. చైనానే కరోనా వైరస్‌ను తయారు చేసి ప్రపంచంపై వదిలిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జిన్‌పింగ్‌తోపాటు భారత్‌లో చైనా రాయబారి సన్ వేడాంగ్ పేరును కూడా ఈ పిటిషన్‌లో జతచేశారు. ఈ పిల్‌ను సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది దాఖలు చేశారు. దీనిపై కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఏప్రిల్ 11న విచారణకు రానుంది.