పెళ్లికి నెలరోజుల ముందు నోటీసెందుకు?: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-10-07T19:56:05+05:30 IST

మతాంతర వివాహాలకు 30 రోజుల ముందు అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసులు ఇవ్వాలన్న

పెళ్లికి నెలరోజుల ముందు నోటీసెందుకు?: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: మతాంతర వివాహాలకు 30 రోజుల ముందు అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసులు ఇవ్వాలన్న నిబంధనపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేక వివాహ చట్టం (ఎస్ఎంఏ)లోని ఈ నిబంధనను సవాల్ చేస్తూ భిన్న మతాలకు చెందిన ఓ జంట ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీఎస్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ ధర్మాసనం.. కేంద్ర న్యాయశాఖ, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరిచేలా ఈ నిబంధన ఉందన్న వాదనపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున అడ్వకేట్ ఉత్కర్ష్ సింగ్ వాదనలు వినిపించారు. ఒకే మత విశ్వాసానికి చెందిన వారి వివాహాలకు ఇలాంటి నిబంధన ఏదీ లేదని ఆయన ధర్మాసనానికి నివేదించారు. 

Updated Date - 2020-10-07T19:56:05+05:30 IST