కోయంబత్తూరులో ఆలయాలపై మాంసం ముక్కలు

ABN , First Publish Date - 2020-05-30T08:47:50+05:30 IST

హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు మాంసపు ముక్కలు విసరడంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సులివాన్‌ వీధిలో

కోయంబత్తూరులో ఆలయాలపై మాంసం ముక్కలు

చెన్నై, మే 29 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు మాంసపు ముక్కలు విసరడంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సులివాన్‌ వీధిలో వేణుగోపాల కృష్ణన్‌ స్వామి, రాఘవేంద్ర ఆలయాలున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాటిని మూసివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మోటార్‌ సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ ప్రవేశద్వారం వద్ద మాంసం ముక్కలు విసిరి పారిపోయా రు. వారు విసిరిన దాన్ని పంది మాంసంగా భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆలయాల వద్ద  ధర్నా చేపట్టారు.  పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై బీజేపీ ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దుండగులను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2020-05-30T08:47:50+05:30 IST