విమానాల్లో ఫొటోలు తీసుకోవచ్చు : డీజీసీఏ

ABN , First Publish Date - 2020-09-14T08:08:40+05:30 IST

విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని, వీటిపై ఎలాంటి నిషేధం లేదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (

విమానాల్లో ఫొటోలు తీసుకోవచ్చు : డీజీసీఏ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని, వీటిపై ఎలాంటి నిషేధం లేదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) స్పష్టం చేసింది. అయితే.. విమాన ప్రయాణానికి అంతరాయం, ఆటంకాలు కలిగించేలా, ప్రమాదాలకు దారితీసేలా రికార్డింగ్‌ గాడ్జెట్లను వినియోగించకూడదని పేర్కొంది.


అలా చేస్తే.. నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించింది. ఈ నెల 9న చండీగఢ్‌-ముంబై ఇండిగో విమానంలో ప్రయాణించిన బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ను ఫొటోలు తీసేందుకు, ఆమె కామెంట్లను రికార్డ్‌ చేసేందుకు విలేకరులు, కెమెరామన్లు ఎగబడ్డారు. ఈనేపథ్యంలో డీజీసీఏ ఈమేరకు స్పష్టతనిచ్చింది. 


Updated Date - 2020-09-14T08:08:40+05:30 IST