ఈ ఏడాదిలోనే కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధం: ఫైజర్

ABN , First Publish Date - 2020-10-28T15:35:19+05:30 IST

ఈ ఏడాది(2020)లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఔషధ కంపెనీ ఫైజర్ తెలిపింది.

ఈ ఏడాదిలోనే కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధం: ఫైజర్

న్యూయార్క్: ఈ ఏడాది(2020)లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఔషధ కంపెనీ ఫైజర్ తెలిపింది. ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బౌర్లా మాట్లాడుతూ అనుకున్నవిధంగా హ్యూమన్ ట్రయల్స్ పూర్తయి, వ్యాక్సిన్ కు అనుమతి లభిస్తే ఈ ఏడాదిలోనే 40 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ తయారు చేయగలమన్నారు. 


నవంబరు మూడవ వారంలో తమ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి సిద్ధం చేయగలమన్నారు.  భారీ స్థాయిలో వ్యాక్సిన్ తయారు చేసేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. కాగా ఫైజర్ కంపెనీ అమెరికా ప్రభుత్వ సాయంలో ఈ ఏడాది చివరి నాటికి 40 మిలియన్ల డోసులు, మార్చి 2021 నాటికి 100 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ సిద్ధం చేయనుంది. 


Updated Date - 2020-10-28T15:35:19+05:30 IST