జులై నుంచి తగ్గనున్న పీపీఎఫ్ వడ్డీ రేట్లు ?

ABN , First Publish Date - 2020-06-22T20:53:43+05:30 IST

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వడ్డీ రేట్లు తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అదీ మామూలుగా కాదు... దాదాపు 46 ఏళ్ళ కనిష్ట స్థాయికి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇప్పటికే... అంటే మూడు నెలలుగా తగ్గిపోతూ వస్తోన్న విషయం తెలిసిందే.

జులై నుంచి తగ్గనున్న పీపీఎఫ్ వడ్డీ రేట్లు ?

న్యూఢిల్లీ : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వడ్డీ రేట్లు తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అదీ మామూలుగా కాదు... దాదాపు 46 ఏళ్ళ కనిష్ట స్థాయికి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇప్పటికే... అంటే మూడు నెలలుగా తగ్గిపోతూ వస్తోన్న విషయం తెలిసిందే. 


పీపీఎఎఫ్‌ వడ్డీ రేట్లు హెచ్చుగా ఉంటే ఉద్యోగులకు ఊరటగా ఉంటుంది. అయితే... పీపీఎఫ్ వడ్డీ రేట్లను జులైలో సంవరించనున్న నేపధ్యంలో... తగ్గుదల నమోదు కానుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు... స్మాల్ సేవింగ్స్ స్కీమ్లపై వడ్డీ రేట్లను కూడా... జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో... 1974 తర్వాత పీపీఎఫ్ వడ్డీ రేట్లు ఏడు శాతం కంటే తక్కువకు పడిపోయిన సందర్భం ఇదే అవుతుందని సమాచారం.


ఎందుకంటే... పీపీఎఫ్ వడ్డీ రేట్లకు, ప్రభుత్వ ప్రభుత్వ చిన్న మొత్తాల పొదువు పథకానికి సంబంధముంటుంది. రెండింటి మెచ్యూరిటీ ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. అదే సమయంలో... పదేళ్ల బాండ్‌పై జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ సరాసరిన 6.42 శాతంగా ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకూ... బాండ్లపై వడ్డీ ఆదాయం... సరాసరిన 6.07 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం అది 5.85 శాతంగా ఉంది. అంటే... జులై నుంచి స్మాల్ సేవింగ్స్‌ స్కీమ్‌లపై వడ్డీ రేట్లు మరింత పడిపోనున్నాయని అర్థం.


సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా ఇంతకు మించిన వడ్డీ రేటేమీ ఇవ్వడంలేదు. అందువల్ల పీపీఎఫ్, సుకన్య పథకాల్లో పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. 

Updated Date - 2020-06-22T20:53:43+05:30 IST