క్రిమిసంహారకాలతో కరోనా చికిత్స

ABN , First Publish Date - 2020-04-26T07:53:25+05:30 IST

‘‘ఇళ్లలో వాడే క్రిమిసంహారకాలను శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసుకుంటే కరోనా లాంటి సూక్ష్మక్రిములన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అది ఊపిరితిత్తులోకీ చొచ్చుకెళ్లి చేయాల్సిన పనినంతా...

క్రిమిసంహారకాలతో కరోనా చికిత్స

  • ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్య


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 25 : ‘‘ఇళ్లలో వాడే క్రిమిసంహారకాలను శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసుకుంటే కరోనా లాంటి సూక్ష్మక్రిములన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అది ఊపిరితిత్తులోకీ చొచ్చుకెళ్లి చేయాల్సిన పనినంతా చేసేస్తుంది. కావాలంటే ఒకసారి అలా చేసి చూడండి’’ ఈ సలహా ఇస్తోంది ఎవరో అజ్ఞాని కాదు. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌!! ఇటీవల వైట్‌హౌస్‌ వద్ద కరోనా కేసులపై రోజువారీ సమాచారాన్ని విలేకరులకు వివరించే క్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బాధ్యతాయుత స్థానంలో ఉన్న ట్రంప్‌ ఇలాంటి తప్పుడు సందేశాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అందరూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రిమిసంహారకాల ఉత్పత్తి కంపెనీలు లైజాల్‌, డెటాల్‌లు స్పందించాయి. తమ ఉత్పత్తులను శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసుకోకూడదని, అలా చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటూ ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాలతో భంగపాటుకు గురైన ట్రంప్‌ కళ్లు విప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్య చేయలేదని, జోక్‌ చేశానంటూ మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు. 


Updated Date - 2020-04-26T07:53:25+05:30 IST