పెర్నోడ్ రికార్డ్ రూ. 15 కోట్లు
ABN , First Publish Date - 2020-04-07T08:25:30+05:30 IST
కరోనాపై పోరాటంలో దేశంలోని పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. మద్యం తయారీ సంస్థ పెర్నోడ్ రికార్డ్ ఇండియా రూ. 15 కోట్లు విరాళం ప్రకటించింది. సినీ, వినోద రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను...

- సినీ కార్మికులకు సోనీ రూ. 10 కోట్లు
- పీఎం కేర్స్‌కు పోర్టు ఉద్యోగుల విరాళం రూ. 7 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరోనాపై పోరాటంలో దేశంలోని పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. మద్యం తయారీ సంస్థ పెర్నోడ్ రికార్డ్ ఇండియా రూ. 15 కోట్లు విరాళం ప్రకటించింది. సినీ, వినోద రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ సంస్థ రూ. 10 కోట్లతో ఓ నిధిని ఏర్పాటు చేసింది. దేశంలోని 12 ప్రధాన పోర్టుల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనం రూ. 7 కోట్లను పీఎం కేర్స్‌కు విరాళంగా ప్రకటించారు. పెప్సీకో ఇండియా సంస్థ 25 వేల కొవిడ్ టెస్టింగ్ కిట్లను అందించేందుకు ముందుకొచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 14 లక్షలు విరాళం ప్రకటించారు.