బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు : ఒం ప్రకాశ్ చౌతాలా
ABN , First Publish Date - 2020-10-15T00:24:16+05:30 IST
బీజేపీ, జననాయక్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా

చండీగఢ్ : బీజేపీ, జననాయక్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా వ్యాఖ్యానించారు. ఈ అసంతృప్తి బరోడా ఉప ఎన్నికపై ప్రభావాన్ని చూపుతుందని జోస్యం చెప్పారు. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా... అన్ని వర్గాల వారూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారన్నది ఈ బైపోల్‌తో తేలిపోనుంది. ఈ ఎన్నికలే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు కూడా దారులు వేయవచ్చు’’ అంటూ చౌతాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 20న కురుక్షేత్రలో పెద్ద ఎత్తున ‘కిసాన్ బచావో’ ర్యాలీని నిర్వహిస్తామని చౌతాలా ప్రకటించారు.