జాతీయ ప‌క్షికి ఘ‌నంగా అంతిమయాత్ర‌... పాడెను మోసిన అధికారులు!

ABN , First Publish Date - 2020-06-18T11:50:08+05:30 IST

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మృతి చెందిన ఒక నెమలికి అత్యంత ఘ‌నంగా అంతిమయాత్ర నిర్వ‌హించారు. విద్యుదాఘాతంతో జాతీయ పక్షి అయిన నెమ‌లి మృతి చెందింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్న...

జాతీయ ప‌క్షికి ఘ‌నంగా అంతిమయాత్ర‌... పాడెను మోసిన అధికారులు!

భరత్‌పూర్‌: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మృతి చెందిన ఒక నెమలికి అత్యంత ఘ‌నంగా అంతిమయాత్ర నిర్వ‌హించారు. విద్యుదాఘాతంతో జాతీయ పక్షి అయిన నెమ‌లి మృతి చెందింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన నెమ‌లికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఘ‌నంగా అంత్య‌క్రియ‌లు చేప‌ట్టారు. ఈ అంత్యక్రియల ఊరేగింపులో స్థానికులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.  మృతి చెందిన నెమ‌లి అంతిమ యాత్ర‌లో దాని పాడెను అధికారులు మోశారు.  అంత‌కుముందు విద్యుదాఘాతంతో జాతీయ పక్షి నెమలి  మృతి చెందిన విష‌యాన్ని కౌన్సిలర్ రామేశ్వర్ సైని అటవీ శాఖ అధికారులకు తెలియ‌జేశారు. వెంట‌నే అటవీ శాఖ అధికారి, తహశీల్దార్ పట్వారీతో కలిసి నెమలి మృతిచెందిన‌ ప్రదేశానికి వ‌చ్చారు. పోస్టుమార్టం అనంత‌రం రామేశ్వర్ సైనీ ఆ మృతి చెందిన నెమలి అంతిమ యాత్ర కోసం ఘ‌న‌మైన ఏర్పాట్లు చేశారు. శ్మశానవాటికలో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆ మృతి చెందిన నెమ‌లికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించారు. 

Updated Date - 2020-06-18T11:50:08+05:30 IST