పుణెలో లాక్‌డౌన్ అని తెలిసిన కొన్ని గంటల్లోనే..

ABN , First Publish Date - 2020-07-11T04:21:24+05:30 IST

మహారాష్ట్రలోని పుణెలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో...

పుణెలో లాక్‌డౌన్ అని తెలిసిన కొన్ని గంటల్లోనే..

పుణెలో జూలై 13 నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్

మద్యం కోసం ఎగబడ్డ మందుబాబులు

పుణె: మహారాష్ట్రలోని పుణెలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జూలై 13 నుంచి 23 వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. పది రోజుల వరకూ మళ్లీ మద్యం దుకాణాలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్టాక్ పెట్టుకోవాలని మద్యం ప్రియులు నిర్ణయించుకున్నారు.


పుణె జిల్లాలో గురువారం ఒక్కరోజే 1,803 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 1,032 కరోనా కేసులు ఒక్క పుణె నగరంలోనే నమోదయిన పరిస్థితి. మహారాష్ట్రలో ముంబై తర్వాత పుణె జిల్లాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పుణె జిల్లాలో ఇప్పటివరకూ 978 మంది కరోనా వల్ల మరణించారు. పుణెలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కేవలం అత్యవసరాలకు మాత్రమే అనుమతినిచ్చింది.



Updated Date - 2020-07-11T04:21:24+05:30 IST