ప్రజలను భావోద్వేగపరంగా మోసగిస్తున్నారు
ABN , First Publish Date - 2020-06-22T07:38:15+05:30 IST
భారత్-చైనా సైనికుల ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను భావోద్వేగపరంగా మోసగిస్తోందని, అటువంటి పనిచేయడం మానుకోవాలని మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు...

- ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్రవేయలేరు: కమల్
న్యూఢిల్లీ, జూన్ 21: భారత్-చైనా సైనికుల ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను భావోద్వేగపరంగా మోసగిస్తోందని, అటువంటి పనిచేయడం మానుకోవాలని మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. శుక్రవారం నాడు అఖిలపక్షాలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ముద్రవేయలేం. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రాథమిక హక్కు. నిజం తెలిసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన అన్నారు.