వాట్సాప్ గ్రూప్‌లో పోస్టింగ్‌లపై కేసులు
ABN , First Publish Date - 2020-04-07T08:34:28+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకరమైన చిత్రాన్ని వాట్సా్‌పలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అబ్దుల్ సలామ్, అతని కుమారుడు రహ్మత్ లను పోలీసులు సోమవారం ఇక్కడ అరెస్ట్...

- పీఎం అభ్యంతరకరమైన చిత్రం కేసులో తండ్రీకొడుకుల అరెస్ట్
- మరో కేసులో గ్రూప్ అడ్మిన్, అడ్వకేట్ అరెస్ట్
నోయిడా, ఏప్రిల్ 6: ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకరమైన చిత్రాన్ని వాట్సా్‌పలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అబ్దుల్ సలామ్, అతని కుమారుడు రహ్మత్ లను పోలీసులు సోమవారం ఇక్కడ అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 153ఏ, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్ నోయిడాలో కరోనాకు సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న ఇద్దరిని ఏప్రిల్ 2న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్, అడ్వకేట్ అని, మరొకరు గ్రూప్ సభ్యుడని చెప్పారు. మరో కేసులో ఇంకొకరిని 5న అరెస్ట్ చేసినట్లు తెలిపారు.