శాంతియుత చర్చలే మార్గం

ABN , First Publish Date - 2020-10-07T08:14:55+05:30 IST

శాంతియుత చర్చల ద్వారానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుందని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు...

శాంతియుత చర్చలే మార్గం

  • మావోయిస్టు సమస్యకు అదే పరిష్కారమని సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: శాంతియుత చర్చల ద్వారానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుందని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ జిల్లాలోని కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓసర్వే నిర్వహించారు. హిందీతోపాటు స్థానిక ఆదివాసీ భాషలైన గోండి, హల్బిలో అభిప్రాయాలను రికార్డు చేశారు.. సర్వేలో భాగంగా మొత్తం 3760మంది అభిప్రాయాలను సేకరించారు. అందులో 76శాతం అభిప్రాయాలను హిందీలోను, 18శాతం అభిప్రాయాలను గోండి భాషలోను, 6శాతం హల్బి భాషలోను రికార్డు చేశారు.  శాంతియుత చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని సర్వేలో పాల్గొన్నవారిలో 91.88శాతం మంది పేర్కొన్నారు.  

Updated Date - 2020-10-07T08:14:55+05:30 IST