పీసీ శర్మకు కరోనా పాజిటివ్.. సన్నిహితులంతా క్వారంటైన్ అవ్వాలంటూ..

ABN , First Publish Date - 2020-08-01T18:35:09+05:30 IST

మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు. దీంతో...

పీసీ శర్మకు కరోనా పాజిటివ్.. సన్నిహితులంతా క్వారంటైన్ అవ్వాలంటూ..

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలనీ... స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆయన కోరారు. ‘‘నా కరోనా రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. నేను ఆస్పత్రిలో చేరుతున్నారు. నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా దయచేసి కొవిడ్-19 పరీక్షలు చేయించుకోండి..’’ అని శర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ.. భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించడంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల శర్మ విమర్శించారు. ‘‘ఆరంభంలోనే దీన్ని నిలువరించడంలో వాళ్లు విఫలమయ్యారు. అందువల్లే ఇప్పుడు మనం సామాజిక వ్యాప్తి పరిస్థితికి వెళ్తున్నాం. కొవిడ్ పేషెంట్ల కోసం ఆస్పత్రుల్లో కనీసం బెడ్లు కూడా లేవు. కరోనా సంక్షోభాన్ని నిర్వహించడంలో  రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది..’’ అని ఆయన ఆరోపించారు. 



Updated Date - 2020-08-01T18:35:09+05:30 IST