‘ఆత్మ గౌరవం’ ఉన్నవారెవరూ ఆ పదవిలో కొనసాగలేరు : గవర్నర్‌కు పవార్ చురక

ABN , First Publish Date - 2020-10-19T17:33:48+05:30 IST

గవర్నర్ కోషియారీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ‘‘ఆత్మ

‘ఆత్మ గౌరవం’ ఉన్నవారెవరూ ఆ పదవిలో కొనసాగలేరు : గవర్నర్‌కు పవార్ చురక

ముంబై : గవర్నర్ కోషియారీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ‘‘ఆత్మ గౌరవం ఉన్నవారెవరూ ఆ పదవిలో కొనసాగరు’’ అంటూ గవర్నర్‌కు పవార్ చురకలంటించారు. గవర్నర్ రాసిన లేఖలో గవర్నర్ కోషియారీ వాడిన భాష సరికాదని సాక్షాత్తూ హోంమంత్రి షా కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు. ‘‘లేఖలో వాడిన భాష సరికాదని హోంమంత్రి చేసిన ప్రకటన తరువాత ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలా? వద్దా? అని ఆలోచిస్తారు.’’ అని పవార్ ఎద్దేవా చేశారు. 


గవర్నర్ భాష సరికాదు : అమిత్‌షా

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొషియారీ ఇటీవల సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో వాడి న భాష సరిగాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తప్పుబట్టారు. ‘ఆ లేఖలో ఎంచుకున్న పదాలు సబబుకాదు. గవర్న ర్‌ సంయమనం పాటించి లేఖ రాసి ఉండాల్సింది’ అని షా ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నేను ఆ లెటర్‌ చదివాను. ఆయన సెక్యుల ర్‌ అన్న పదాన్ని మామూలుగా ఉటంకించారు. అయినా దాన్ని వాడకుండా ఉండాల్సింది’ అని అభిప్రాయపడ్డారు.


మహారాష్ట్రలో దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడంపై కొషియారీ.. సీఎంకు లేఖ రాశారు. భారీ జన సమూహాలు గుమిగూడితే కొవిడ్‌ విషమించవచ్చని, అందుకే ఆలయాలు తెరవడం లేదని ఉద్ధవ్‌ పేర్కొనడా న్ని విమర్శిస్తూ కొషియారీ లేఖ రాశారు. ‘విచిత్రం ఏమిటంటే మీరు బార్లు తెరుస్తారు, రెస్టారెంట్లు తెరుస్తారు, బీచ్‌లు తెరుస్తారు. దేవు ళ్లు, దేవతలను నిరంతరం లాక్‌డౌన్‌లోనే ఉంచుతున్నారు. మీకేమైనా దివ్య సంకేతా లు అందుతున్నాయా? ప్రార్థనా స్థలాలను తెరవడాన్ని వాయిదా వేస్తున్నారు? సెక్యులర్‌ పదాన్ని ఎన్నో ఏళ్ల పాటు ద్వేషించిన మీరు ఆకస్మికంగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని గవర్నర్‌ హేళనగా ప్రశ్నించారు.

Updated Date - 2020-10-19T17:33:48+05:30 IST