కేంద్రం పరిణతితో ఆలోచించాలి : శరద్ పవార్

ABN , First Publish Date - 2020-12-06T19:30:35+05:30 IST

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం పరిపక్వతతో వ్యవహరించాలని ఎన్సీపీ అధినేత

కేంద్రం పరిణతితో ఆలోచించాలి : శరద్ పవార్

ముంబై : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం పరిపక్వతతో వ్యవహరించాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రానికి సూచించారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం గ్రహించి, తగినవిధంగా ఆలోచించాలని ఆయన కోరారు. ప్రభుత్వం అలా చేయని పక్షంలో ఈ ఉద్యమం ఢిల్లీకే పరిమితం కాదని, దేశమంతా విస్తరిస్తుందని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. గోధుమలు, వరి పంటను దేశంలోనే పంజాబ్, హర్యానా రైతులు ఎక్కువగా పండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ధాన్యపు గింజలను 13 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోందని, ఇందులో ప్రధాన పాత్ర పంజాబ్, హర్యానాదే అని ఆయన తేల్చి చెప్పారు. అంతటి ప్రాధాన్యం ఉన్న రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పరిణతితో ఆలోచించాలని, దురదృష్టవశాత్తు కేంద్రం అలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. అతి తొందర్లోనే రైతులకు అన్ని వర్గాల మద్దతూ లభిస్తుందని, అప్పుడే ఈ నిరసనలు ఢిల్లీకే పరిమితం కాదని, దేశమంతా విస్తరిస్తాయని శరద్ పవార్ పేర్కొన్నారు. 

Read more