‘యూపీఏ చైర్మన్ ’ బాధ్యతలపై మరోసారి స్పందించిన పవార్

ABN , First Publish Date - 2020-12-28T00:25:30+05:30 IST

యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే దీనిపై

‘యూపీఏ చైర్మన్ ’ బాధ్యతలపై మరోసారి స్పందించిన పవార్

ముంబై : యూపీఏ చైర్మన్ పదవిపై తనకు ఎలాంటి ఆసక్తీ లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘యూపీఏ చైర్‌పర్సన్ పదవిపై నాకు ఎలాంటి ఆసక్తీ లేదు. అలాంటి ప్రతిపాదన ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదు.’’ అని పవార్ కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రైతు ఆందోళన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను కలవడానికి పవార్ ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఈ సమాధానం అత్యంత ఆసక్తి రేపుతోంది. గతంలో కూడా ఈ వార్త దేశ రాజకీయాల్లో హల్ చల్ చేసింది. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎన్సీపీ స్పందించింది. ‘‘ఈ విషయంపై ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఈ విషయంపై యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చకు కూడా రాలేదు. రైతుల ఆందోళన నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి పుకార్లు చేస్తున్నారు.’’ అని ఎన్సీపీ గతంలోనే స్పష్టం చేసింది. 

Updated Date - 2020-12-28T00:25:30+05:30 IST