రామేశ్వరం తీరంలో గస్తీ ముమ్మరం

ABN , First Publish Date - 2020-08-18T15:35:13+05:30 IST

రామేశ్వరం తీరంలో గస్తీ ముమ్మరం

రామేశ్వరం తీరంలో గస్తీ ముమ్మరం

చెన్నై: శ్రీలంక నుంచి అజ్ఞాత వ్యక్తులు దేశంలోకి ప్రవేశించే అవశాశముందనే కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో కోస్ట్‌గార్డ్‌ దళాలు అప్రమత్త మయ్యాయి. రామనాథపురం జిల్లా రామేశ్వరంకు అతిసమీపంలో శ్రీలంక ఉంది. అక్కడి నుంచి అజ్ఞాత వ్యక్తులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ శాఖ హెచ్చరించింది. దీంతో, చెన్నైలోని కోస్ట్‌గార్డ్‌కు సొంతమైన ఐదు అత్యాధునిక నౌకలు రామేశ్వరం తీరప్రాంతంలో గస్తీ పనులు చేపట్టాయి. రెండు వేగంతో నడిచే నౌకలు, రెండు హోవర్‌క్రాఫ్ట్‌ నౌకలు మండపం నుంచి రామేశ్వరం, ధనుష్కోటి వరకు రాత్రింబవళ్లూ గస్తీ పనులు చేపట్టాయి. చేపల వేటకు వెళ్లే జాలర్లు అనుమానాస్పదంగా పడవలు, వ్యక్తులు సంచరించడం గుర్తిస్తే వెంటనే తమను సమాచారం అందించాలని కోస్ట్‌గార్డ్‌ అధికారులు కోరారు. ఊచ్చిపుల్లి నౌకా స్థావరం నుంచి కోస్ట్‌గార్డ్‌కు సొంతమైన ఓ హెలికాప్టర్‌ ద్వారా రామేశ్వరం, పరిసర ప్రాంతాల్లో గస్తీ చేపట్టారు.

Updated Date - 2020-08-18T15:35:13+05:30 IST