యూపీలో కోవిడ్‌-19ను త‌రిమికొడుతున్న ‌వీరులు

ABN , First Publish Date - 2020-05-09T14:01:03+05:30 IST

కరోనా ముప్పు మధ్య ఉపశమనం క‌లిగించే వార్త ఒక‌టి వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్ర‌తి‌రోజూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే క‌రోనా నుంచి కోలుకుంటున్న రోగుల‌ జాతీయ సగటు 29.35 శాతం కాగా...

యూపీలో కోవిడ్‌-19ను త‌రిమికొడుతున్న ‌వీరులు

ల‌క్నో: కరోనా ముప్పు మధ్య ఉపశమనం క‌లిగించే వార్త ఒక‌టి వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్ర‌తి‌రోజూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే క‌రోనా నుంచి కోలుకుంటున్న రోగుల‌ జాతీయ సగటు 29.35 శాతం కాగా, యూపీలో ఇది 40.09 శాతంగా ఉండ‌టం విశేషం. రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్థీ, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో ఈ విష‌య‌న్ని తెలియ‌జేశారు. మే 4 నాటికి యూపీలో 1939 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. అవి ఇప్పుడు 1821 కు త‌గ్గాయ‌ని అన్నారు. రాష్ట్రంలో కోలుకుంటున్న రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తాజాగా రాష్ట్రంలో 373 క‌రోనా పరీక్షలు నిర్వ‌హించ‌గా, 18 పాజిటివ్, 355 నెగటివ్‌గా తేలాయ‌న్నారు. ప్రస్తుతం 1885 మంది రోగులు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నార‌ని,  9575 మంది క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌న్నారు. 

Updated Date - 2020-05-09T14:01:03+05:30 IST