ఫేస్‌బుక్ భారత్ చీఫ్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
ABN , First Publish Date - 2020-09-03T08:40:29+05:30 IST
ఫేస్‌బుక్ రాజకీయ పక్షపాతం చూపుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ సంస్థ భారత్ అధినేత అజిత్ మోహన్.. పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు...

- మళ్లీ 10న సమావేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఫేస్‌బుక్ రాజకీయ పక్షపాతం చూపుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ సంస్థ భారత్ అధినేత అజిత్ మోహన్.. పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు. ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని కమిటీ దాదాపు రెండు గంటలకుపైగా అజిత్‌ను ప్రశ్నించింది. పౌరుల హక్కులను పరిరక్షించడం, ఆన్‌లైన్ మీడియా ప్లాట్‌ఫాంల దుర్వినియోగాన్ని నిరోధించడం, డిజిటల్ ప్రపంచంలో మహిళలకు పత్యేక భద్రత కల్పించడం వంటి వాటిపై అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. అయితే, కమిటీని పునర్నిర్మించాలనే కారణంతో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో.. ఈ నెల 10న ఫేస్‌బుక్ ప్రతినిధులతో మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.