పీడీఏ కూటమి సీఎం అభ్యర్థిగా పప్పూ యాదవ్
ABN , First Publish Date - 2020-10-14T22:58:21+05:30 IST
పప్పూ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనఅధికార్ పార్టీ - లోక్‌తాంత్రిక్ ప్రకటించింది. తమ

పాట్నా : పప్పూ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనఅధికార్ పార్టీ - లోక్‌తాంత్రిక్ ప్రకటించింది. తమ కూటమి అభ్యర్థిగా పప్పు యాదవ్ ను నిలబెడుతున్నామని ఆ కూటమి నేతలు బుధవారం ప్రకటించారు. మాధేపూర నియోజకవర్గం నుంచి పప్పూ యాదవ్ ఎలక్షన్ గోదాలోకి దిగనున్నారు. పప్పూ యాదవ్ వ్యవహార శైలి ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని, బిహార్‌ను అమితంగా ప్రేమించే ప్రజానీకం ఈసారి తమ కూటమికి అవకాశమిస్తారని తాము భావిస్తున్నట్లు ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. అభివృద్ధే అజెండాగా నితీశ్ ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టే నితీశ్ రాజకీయాలను ఎందుకు నెరుపుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వరదలు, వలసలు గురించి నితీశ్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని సవాల్ విసిరారు. బిహార్‌లో ఆరు లైన్ల రోడ్డు క్రెడిట్ మొత్తం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కే దక్కుతుందని, సీఎంగా పగ్గాలు చేపట్టి 15 సంవత్సరాలు గడచినా... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేవని పప్పు యాదవ్ విమర్శించారు.